సరస్వతి పుష్కరాలకు స్పెషల్ బస్సులు: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ మే 21 నుండి జూన్ 1 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.

సరస్వతి పుష్కరాలకు స్పెషల్ బస్సులు: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మే 21 (గురువారం) నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం సురక్షితంగా మరియు సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించింది.

భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుండి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుండి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. నర్సంపేట (9959226293), తొర్రూరు (9959226053), భూపాలపల్లి (9959226707), మణుగూరు (9959225963), కరీంనగర్ (9959225920), మంథని (9959225923), హన్మకొండ (9959226049), మహబూబాబాద్ (9959226054), జనగాం (9959226050), పరకాల (9959226051), నిజామాబాద్ (9959226016), గోదావరిఖని (9959225922), మంచిర్యాల (9959226004) నంబర్లలో సంప్రదించి బస్సుల వేళలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కొరకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఎండీ తెలిపారు. భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని, సురక్షితమైన వాతావరణంలో కాళేశ్వర సరస్వతి పుష్కరాల యాత్రను విజయవంతం చేసుకోవాలని కోరారు.

Next Story