- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాక్ట్
by Gantepaka Srikanth |
రాష్ర్ట ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక యాక్ట్ తీసుకురాబోతుందని కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక యాక్ట్ తీసుకురాబోతుందని కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి తెలిపారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం పొందనుంది. ఈ బిల్లు రాహుల్ గాంధీ ఆలోచనల్లో భాగంగా తీసుకువస్తున్నామని చెప్పారు.మంత్రి వర్గం ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెడతామని, కొత్త చట్టం ద్వారా భద్రత, హక్కులు, సామాజిక రక్షణ కల్పించబోతున్నామని స్పష్టం చేశారు. కొత్త చట్టం ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి మార్పులు, చేర్పులు అవసరమో కూడా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుంది. గిగ్ వర్కర్ల భవిష్యత్తు భద్రపరచడంతో పాటు వారికి స్థిరమైన హక్కులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Next Story






