- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ.. మరోసారి షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టును గడువు కోరిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును గడువు కోరిన విషయం తెలిసిందే. గతంలో కోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తికావడంతో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కార్యాలయం కోరింది. ఇప్పటి వరకు కేవలం నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, అరికెపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై ఈనెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపడతామని, మొదట పిటిషనర్లు.. ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నారు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.






