- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ హత్య : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ ప్రసాద్కుమార్తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ ప్రసుత్తం రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా ప్రభావితం చేసి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయేనిని ఆ చట్టానికి రాజ్యాంగానికీ గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోందన్నారు. చేతుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న నాయకులే, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన స్పీకర్‌పై ప్రభావం చూపి ఈ తరహా నిర్ణయం తీసుకునేలా చేశారని ఆరోపించారు. స్పీకర్ పదవి స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పదవి అన్నారు.
స్పీకర్ రాజ్యాంగాన్ని అవహేళన చేయడం సరికాదు : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
రాష్ట్ర స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవహేళన చేయడం సరికాదని, సుప్రీం కోర్టు స్పష్టంగా మూడు నెలల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశిస్తే, మార్చి 18 న ముగ్గురు ఎమ్మెల్యే లు బీఆర్ఎస్నుండి కాంగ్రెస్ లో చేరారు. 21 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారని, సుప్రీం కోర్టు ఎల్లుండి వరకు తీర్పు ఇవ్వాలని హెచ్చరించడంతో ప్రస్తుతం ముగ్గురి ఎమ్మెల్యే లకు ఒక ఎమ్మెల్యే పై క్లీన్ చిట్ ఇచ్చారు. మిగతా ఇద్దరు ఎమ్మెల్యే లకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టారో సమాధానమివ్వాలన్నారు. కేవలం ఎమ్మెల్యే వెంకట రావుది మాత్రమే ఎటువంటి ఆధారాలు లేవనీ క్లిన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ల పార్టీ ఫిరాయింపులపై ఎటువంటి తీర్పు వెలువరించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారో చెప్పాలన్నారు.
ఏడుగురు ఎమ్మెల్యే లు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణ మోహన్, గాంధీ, ప్రకాష్ గౌడ్ లకు క్లిన్ చిట్ ఇచ్చి మిగిలిన యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ ల పై తీర్పు కూడా పెండింగ్ లో పెట్టారు. మూడు నెలల్లో ప్రకటించాల్సిన తీర్పును కాలయాపన చేసి కేవలం ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రమే తీర్పు వెల్లడించి, మిగతా వారివి పెండింగ్ లో పెట్టడం వెనక కారణమేమిటని నిలదీశారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి స్పీకర్ పనిచేస్తున్నట్లు ఉన్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ఎందుకని ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్‌చేశారు.






