- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు.. స్పీకర్ సీరియస్!
రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన కొనసాగిస్తోంది. మంత్రి పొంగులేటి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శాసనసభలో రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని, హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ పోడియం దగ్గరకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సీరియస్ అయ్యారు. సీఐడీ విచారణకు సీఎం ఆదేశించిన తర్వాత కూడా హౌస్ కమిటీ కోరడంలో అర్థం ఉందా? ప్రజా సమస్యలు మాట్లాడాల్సిన సభలో ఈ రకమైన అల్లరి చేయడం మీకు న్యాయంగా అనిపిస్తోందా అన్నారు. స్పీకర్ చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు నినాదాల మధ్యే సభ కొనసాగింది.
Next Story






