- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్మనీ దేశ అధికార ఎస్‌డీపీ ప్రతినిధుల బృందంతో స్పీకర్ గడ్డం ప్రసాద్
జర్మనీ దేశ అధికార సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ ) ప్రతినిధుల బృందం రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో శుక్రంవారం భేటీ అయ్యారు.

దిశ , తెలంగాణ బ్యూరో : జర్మనీ దేశ అధికార సోషల్ డెమొక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ ) ప్రతినిధుల బృందం రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో శుక్రంవారం భేటీ అయ్యారు. రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన జర్మనీ ఎస్‌డీపీ సెక్రటరీ జనరల్ సబీనా ఫెండరీచ్, ఆసియా- పసిఫిక్ హెడ్ మైక్రో గుంథర్, ఇండియా డైరెక్టర్ క్రిస్టోప్ పిమోర్‌లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు, అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా జర్మనీ బృంద సభ్యులను పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందున్నదని జర్మన్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉండడంతో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రం శాసనసభ, శాసనమండలి వివరాలను వివరించారు. శాసనసభలో 119 మంది సభ్యులు, శాసనమండలి లో 40 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. శాసనసభ సభ్యులను ఎన్నికల ద్వారా ప్రజలు నేరుగా ఎన్నుకుంటారని, శాసనసభలో చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని వారికి వివరించారు.






