కడియం అనర్హత పిటిషన్‍పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు రిజర్వ్

by Prasad Jukanti |   (  Updated:2026-03-05 12:32:56  IST  )

ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేశారు.

కడియం అనర్హత పిటిషన్‍పై స్పీకర్ గడ్డం ప్రసాద్  తీర్పు రిజర్వ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్ పై స్పీకర్ విచారణ పూర్తయింది. కడియం కేసులో ఇరువర్గాల వాదనలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ చాంబర్ లో ఫిరాయింపు ఎ్మమ్మెల్యే కేసు విచారణ జరిగింది. మరో వైపు ఇదే ఆరోపణలు ఎందుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం ఇరువర్గాల వాదనలను స్పీకర్ వింటున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‍చిట్ ఇచ్చారు. అయితే కడియం, దానం పార్టీ ఫిరాయించారనే విషయంలో ఆధారాలు ఉన్నాయని అందువల్ల వీరిద్ధరిపై చర్యలు తప్పవా అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story