- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా ఛాంబర్‌లో మాట్లాడుకుందాం రండి’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచన
ఈ కార్ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, భూ భారతి బిల్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఇది చాలా ముఖ్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ కార్ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, భూ భారతి బిల్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఇది చాలా ముఖ్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ నేతలు సభ జరగకుండా ఆందోళన నిర్వహించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ బిల్లుపై చర్చ ఉందని, ఆ తర్వాత ఈ కార్ రేస్ పై చర్చ జరుపుదామని స్పీకర్ హరీశ్ రావుకు వివరించారు. హరీశ్ రావు సీనియర్ సభ్యుడని, అన్ని తెలిసి ఇలా చేయడం తగదన్నారు. కార్ రేసింగ్‌పై మంత్రి లేకుండా చర్చ ఎలా జరుపుతారని ఫైరయ్యారు.
బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూభారతి బిల్లు పాస్ అయ్యాక తన చాంబర్‌కు పిలుస్తానని, అక్కడ మాట్లాడుదామని స్పష్టం చేశారు. ఈ చట్టానికి మద్దతు తెలపాలని సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ అనుమతి ఇచ్చి.. ఏసీబీ కేసు పెట్టిన తర్వాత సభలో చర్చ జరగదని, చర్చకు సంబంధించిన అంశం సభలో ఉత్పన్నం కాదని నొక్కిచెప్పారు.






