- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ నివసించిన ఇంటిని సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా
లండన్ పర్యటనల్లో ఉన్న తెలంగాణఅసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లండన్ నగరంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నివసించిన గృహాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లండన్ పర్యటనల్లో ఉన్న తెలంగాణఅసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లండన్ నగరంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నివసించిన గృహాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ఉపయోగించిన లైబ్రరీని, పడకగదిని, ఫోటో గ్యాలరీని మరియు వారు వాడిన వస్తువులను ప్రసాద్కుమార్సందర్శించారు. అంబేద్కర్లండన్ లోని కింగ్స్ హెన్రీ రోడ్డులో 1921-22 సంవత్సరాల్లో నివసించారు. అంబేద్కర్ జ్ఞాపకార్ధం ఆయన నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా మార్చారు.
ఈసందర్భంగా విజిటర్స్ పుస్తకంలో స్పీకర్ప్రసాద్ కుమార్ వ్రాస్తూ.. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బీఆర్ అంబేద్కర్ లండన్ నగరంలో నివసించిన ఇంటిని సందర్శించడాన్ని నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నానను. వెనుకబడిన కులంలో జన్మించి లండన్ నగరంలో ఉన్నత న్యాయ విద్య అభ్యసించి, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ నాకు ఎల్లప్పుడూ స్పూర్తి. నేను నా జీవితాంతం అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తాను. అంబెడ్కర్ ఆశీర్వాదంతోనే నేను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యాను. అంబేద్కర్ జ్ఞాపకార్ధం వారిని గౌరవిస్తూ వారు నివసించిన ఇంటిని మ్యూజియంగా మార్చి సమర్ధవంతంగా నిర్విహిస్తున్న భారత ప్రభుత్వానికి నా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ నర్సింహా చార్యులు, స్పీకర్ ఓఎస్డీ పీ. వెంకటేశం, అధికారులు అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు.






