- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఎండ తగలకుండా ఎస్పీ శభరీష్ అదిరిపోయే ఉపాయం
ట్రాఫిక్ విధులు నిర్వహించే సమయంలో పై నుండి ఎండ కొడితే కింద నుండి రోడ్డు వేడెక్కి చెప్పలేనంతగా ఆ ప్రభావం వారిపై పడుతుంది. అయితే వారికి కాస్త ఉపశమనం ఉచ్చేలా ఎస్పీ శభరీష్ ఓ ఉపాయం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ చివరివారం నుండే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయట తిరగలేని పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు ముసలి వాళ్లు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఎండలకు ఆఫీసుల్లో ఏసీలో ఉద్యోగాలు చేసేవాళ్లపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ బయట ఉద్యోగాలు చేసేవారిపై మాత్రం ఎంతో ప్రభావం ఉంటుంది. ఎండలో బయట ఉద్యోగాలు చేసేవాళ్లలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఉంటారు. ఎండ ప్రభావం ఏ స్థాయిలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు రోడ్డు మధ్యలో నిల్చోవాల్సిందే.
ట్రాఫిక్ విధులు నిర్వహించే సమయంలో పై నుండి ఎండ కొడితే కింద నుండి రోడ్డు వేడెక్కి చెప్పలేనంతగా ఆ ప్రభావం వారిపై పడుతుంది. అయితే వారికి కాస్త ఉపశమనం ఉచ్చేలా ఎస్పీ శభరీష్ ఓ ఉపాయం చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడే షెల్టర్ లో నీళ్ల క్యాన్ సెట్ చేసి దాని ద్వారా పై నుండి నీటి చుక్కలు పడేలా అమర్చారు. దాంతో నీళ్లు మోటార్ ద్వారా పై నుండి కిందపడుతూ డ్యూటీ చేసేవాళ్లకు చల్లదనాన్ని ఇస్తున్నాయి. అంతే కాకుండా పోలీసులకు దాహం వేసినప్పుడు తాగేందుకు నీళ్లు, ఎండ వేడిమి తట్టుకునే కళ్లకు పెట్టుకునేందుకు గాగుల్స్ కూడా ఇచ్చారు. దీంతో ఎస్పీ తీసుకున్న నిర్ణయంపై ట్రాఫిక్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






