ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ.. వివాదంపై స్పందించిన ఎస్పీ శైలజ

by Ramesh Naini |

దిగ్గజ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం (Balasubrahmanyam) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో (డిసెంబరు 15) ఈ రోజు ఆవిష్కరించారు.

ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ.. వివాదంపై స్పందించిన ఎస్పీ శైలజ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం (Balasubrahmanyam) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో (డిసెంబరు 15) ఈ రోజు ఆవిష్కరించారు. అయితే, విగ్రహం ఏర్పాటుపై గత కొన్ని రోజులుగా ప్రజాసంఘాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితర తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎస్పీ బాలు చెల్లి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్పీ బాలు గాయకులందరికీ స్ఫూర్తిదాయకం అని అన్నారు.

ఒక అన్నయ్యగా నాకు కూడా ఓ కొత్త బాటను ఏర్పరిచారని చెప్పుకొచ్చారు. బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన బతికి ఉన్నపుడే తన విగ్రహం కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం పక్కన పెట్టాలని అన్నట్లు గుర్తుకు చేశారు. వివాదం గురించి స్పందిస్తూ.. అన్నయ్య విగ్రహం గురించి నిరసనలు తనకు తెలియదన్నారు. విగ్రహ ఏర్పాటులో తన ప్రమేయం ఏమీ లేదని, మొత్తం సంగీతం బృందం కమిటీ చూసుకుంటుందని, బాలు తెలియని వారు అంటూ ఎవరూ లేరన్నారు.

Next Story