HYD: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

by Gantepaka Srikanth |

HYD: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ

HYD: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన SP బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొ్న్నారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ విషయంపై నటుడు శుభలేఖ సుధాకర్‌తో ఉద్యమకారుడు పృథ్విరాజ్‌తో పాటు మరికొంతమంది వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ చేయడానికి వీలు లేదంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పృథ్విరాజ్‌తో పాటు తెలంగాణ ఉద్యమ కారులను అక్కడ నుంచి పంపించివేశారు. ఈరోజు ఆవిష్కరణ చేయనుండటంతో వారు అడ్డుకునే ప్రమాదం ఉందని పోలీసులు భారీగా మోహరించారు.

Next Story