సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త

by Disha Web Desk 2 |
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటక ప్రియులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంస్థ సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ మేనేజర్‌ బి.చంద్రమోహన్‌ విలేకరులతో మాట్లాడారు. తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు తమ సంస్థ రైళ్లను నడుపుతోందని తెలిపారు. వివరాలకు 8287932318, 08912500695 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని కోరారు. సమావేశంలో స్థానిక స్టేషన్‌ మేనేజర్‌ మెదలవలస రవి పాల్గొన్నారు. మహాలయ పిండప్రదాన్‌ పేరుతో సెప్టెంబరు 15వ తేదీ అర్ధరాత్రి సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరనుంది. 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఆమదాలవలస చేరుతుంది.

విజయనగరం-శ్రీకాకుళం మీదుగా భువనేశ్వర్‌, వారణాసి ప్రయాగ ఘాట్‌ సంగమం, గయ ప్రాంతాలకు వెళ్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఐదు రాత్రులు, ఆరు రోజుల పగటిపూట ప్రయాణం ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించే ఒక్కో మనిషికి థర్డ్‌ ఏసీ రూ.18,785, స్లీపర్‌ క్లాస్‌ రూ.14,485 టికెట్‌ ధర చెల్లిస్తే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, భోజనం, రాత్రి, డిన్నర్‌, వాటర్‌ బాటిల్‌ సంస్థ అందజేయనుంది. విశ్రాంతి సమయాల్లో డార్మిటరీ, తదితర సదుపాయాలు కల్పిస్తారు. వీటికి ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పర్యాటక ప్రాంతాలను ఐఆర్‌సీటీసీ గైడ్లు చూపించి వాటి చరిత్రను వివరిస్తారు.



Next Story

Most Viewed