- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నేను ఉన్నాను.. మీరు ధైర్యంగా ఉండండి’.. ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూసూద్ భరోసా
by Gantepaka Srikanth |
‘నేను ఉన్నాను.. ధైర్యంగా ఉండండి’.. ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూసూద్ భరోసా

X
దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన తెలుగు నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని(Fish Venkat Family) నటుడు సోనూసూద్(Sonu Sood) పరామర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లారు. భార్యా, పిల్లతో మాట్లాడారు. బాధపడొద్దని ధైర్యం చెప్పారు. తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిష్ వెంకట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంకట్ మరణం తనను కలచివేసిందన్నారు. కాగా, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొన్ని రోజుల క్రితం ఫిష్ వెంకట్ మరణించిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన సోనూసూద్ తన వంతుగా వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.
Next Story






