మిస్‌వరల్డ్ పోటీల కోసం విచ్చేసిన సోనూసూద్.. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు..

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నమిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

మిస్‌వరల్డ్ పోటీల కోసం విచ్చేసిన సోనూసూద్.. మరో ఇద్దరు ముద్దుగుమ్మలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న (Miss World) మిస్‌‌వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కొన్ని రోజుల్లో ఈవెంట్ జరగనుండటంతో ప్రపంచ దేశాల భామలు, ప్రతినిధులు ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు దేశాల బ్యూటీలు భాగ్య‌న‌రంలో వాలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్, నటుడు సోనూసూద్ హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం సోనూసూద్ నగరానికి విచ్చేశారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో సోను సూద్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.

అంతకు ముందు మిస్ వరల్డ్ పోటీల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సుందరీమణులు మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్ట్డ్ (jasmine gerhardt), మిస్ ఫ్రాన్స్ అగాథే లౌ కౌట్‌ (Agathe Lou Coutt)కు అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా 150 పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పోటీల ద్వారా తెలంగాణ క‌ల్చ‌ర్‌ను ఇతర దేశాలకు తెలిసేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక శాఖ దీనికోసం ఏర్పాట్లు చేస్తోంది.

Next Story