- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోనియాగాంధీ స్వరాష్ట్ర కలను సాకారం చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)లో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit)లో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ముందుగా రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రాహాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy)తో పాటు వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. ప్రతి విగ్రహానికి రూ.17.50 లక్షల వ్యయం చొప్పున రూ.5.80 కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 9న సోనియాగాంధీ (Sonia Gandhi) నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ.. అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారని అన్నారు. అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామని, నేడే సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయని, తెలంగాణ అభివృద్ధి వైపు పురోగమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read More.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎఫెక్ట్.. నానక్‌రాంగూడలో భారీగా ట్రాఫిక్ జామ్
రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబైన కలెక్టరేట్లు.. కాసేపట్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ






