- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబైన కలెక్టరేట్లు.. కాసేపట్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కలెక్టరేట్ (District Collectorates) ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏకకాలంలో ఆవిష్కరించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కలెక్టరేట్ (District Collectorates) ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏకకాలంలో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit-2025) వేదికగా ఉదయం 10 గంటలకు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు వివిధ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు కలిగిన ఏకశిలా విగ్రహంగా రూపొందించారు. ఈ విగ్రహాలను ప్రముఖ శిల్పి అనంతపద్మనాభ స్వామి (Anantapadmanabha Swamy) రూపకల్పన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్లలో విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రత్యేకంగా రూ.75 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌లలో సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు, బతుకమ్మ పాటలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించనున్నారు.






