- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌ని అభినందించిన సోనియా గాంధీ.. ఢిల్లీలో సమావేశం
ఢిల్లీలో ఇవాళ తన నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో ఇవాళ తన నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను సోనియా గాంధీకి సీఎం అందజేశారు. తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి ఆయన తెలిపారు.
ప్రజా పాలనలో రెండేళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి సీఎం వివరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని సోనియా గాంధీ అభినందించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.






