- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నది. కొండాపూర్‌లోని సుమధర అపార్ట్‌మెంట్‌లో నివాసముండే మనుశ్రీ సోమవారం సాయంత్రం పొద్దుపోయాక బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మనుశ్రీ(32)ది కర్ణాటకగా గుర్తించారు. పని ఒత్తిడి వల్లే మనుశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల బలవన్మరణాలు పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడితో బాధపడుతూ.. తనువు చాలిస్తున్న వారి సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆఫీస్‌తోపాటు.. వ్యక్తిగత ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి.






