జేఈఈలో సోషల్ వెల్ఫేర్ గురుకులాల సత్తా.. ఐఐటీలకు 163 మంది విద్యార్థులు

by Ramesh Naini |

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి.

జేఈఈలో సోషల్ వెల్ఫేర్ గురుకులాల సత్తా.. ఐఐటీలకు 163 మంది విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయి. జేఈఈ మెయిన్స్-2026, జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్షల్లో గురుకుల విద్యార్థులు సాధించిన ఫలితాలు నాణ్యమైన ప్రభుత్వ విద్యకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సొసైటీ పరిధిలోని 37 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థల్లో సైన్స్, ఆర్ట్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఓఈలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 61 మంది విద్యార్థులు డైరెక్ట్ ఐఐటీలో సీటు పొందారు. 102 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించి మొత్తం 163 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. అదేవిధంగా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్ లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కమ్యూనిటీ ర్యాంకుల్లోనూ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 500 లోపు ఒకరు, 1000 లోపు ముగ్గురు, 2000 లోపు 14 మంది, 3000 లోపు 25 మంది, 5000 లోపు 39 మంది విద్యార్థులు కమ్యూనిటీ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో తమ సత్తాను నిరూపించారు.

జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన విద్యార్థులు

చిలుకూరు బాయ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన పీ. హేమంత్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా కమ్యూనిటీ ర్యాంక్–200 సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. గౌలిదొడ్డి బాయ్స్ సీఓఈకి చెందిన సత్య స్వరూప్ (ఈడబ్ల్యూఎస్–741), వైభవ్ ప్రసాద్ (ఎస్టీ–984), తనీష్ (ఎస్సీ–1077), శిరీష (ఎస్టీ–1298), సాయిరాం (ఎస్సీ–1456), ప్రియాంక (ఎస్టీ–1509), వి.మంజుల (ఎస్సీ–1628), డి.దివ్య (ఎస్టీ–1696), ఎస్.సందీప్ (ఎస్సీ–1706), పరమాండ్ల మనస్విత్ (ఎస్సీ–1829), డి.శ్రీశాంత్ (ఎస్టీ–1881), కె.శ్రీ వర్ష (ఎస్సీ–1907), డి.అక్షయ (ఎస్సీ–2054), ఎస్.పూజ (ఎస్టీ–2197), కె.ఉదయ్ (ఎస్టీ–2313), జయ సింధూర (ఎస్సీ–2423), ఏ.అభినవ్ (ఎస్టీ–2431), జె.నవీన్ (ఎస్సీ-2521) తదితరులు ర్యాంకులు సాధించారు.

Next Story