- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS vs Congress: ఐపీఎల్ మ్యాచ్ పై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే?
ఐపీఎల్ మ్యాచ్ ఏర్పాట్లపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ (Congress) వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య రాజకీయం రంజుగా సాగుతున్నది. ఏ చిన్న అవకాశం దొరికినా ఇరుపార్టీలు పరస్పర విమర్శలకు పదును పెడుతున్నాయి. నిన్న ఉప్పల్ (Uppalu Stadium) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్ హెచ్ వర్సెస్ లక్నో మధ్య ఐపీఎల్ (IPL) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద ఏర్పాట్లు క్రికెట్ అభిమానులను నిరాశపరిచాయని స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా భారీగా మురుగు నీరు నిలిచిందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది.
ఏర్పాట్లపై బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్ కు సరిగా ఏర్పాట్లు కూడా చేయనిలేని వాడు హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తాడట అంటూ పోస్టు చేశారు. దీనిపై స్పందించి కాంగ్రెస్ అభిమాని ఒకరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా (HCA) ఉన్నది మీ దొర గడిలోని వ్యక్తినే. అతడు మీ అండతోనే ఆ పదవి ఎక్కాడు. ఆయన పని చేయకపోతే గల్లా పట్టి అడుగు అంటూ కౌంటర్ ఇచ్చారు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నది హరీశ్ రావు రెఫరెన్స్ తో ఆ పదవిలోకి వచ్చిన వ్యక్తి అని కామెంట్ చేయగా బీఆర్ఎస్ మద్దతుదారులు స్పందిస్తూ ఆ మురుగు నీరు గ్రౌండ్ బయట ఉందని అది మున్సిపల్ శాఖ కిందకు వస్తుందని కామెంట్ చేశారు. మొత్తంగా నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ కాస్త పొలిటికల్ సిక్సర్స్ కు కేరాఫ్ గా మారింది.






