BRS vs BJP: బీఆర్ఎస్, బీజేపీ మధ్య ‘పావురాల గుట్ట చిచ్చు’.. ఆ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలతో రగడ

by Prasad Jukanti |   (  Updated:2025-04-29 06:38:15  IST  )

బీఆర్ఎస్, బీజేపీ మధ్య ‘పావురాల గుట్ట చిచ్చు’ రాజేసింది.

BRS vs BJP: బీఆర్ఎస్, బీజేపీ మధ్య ‘పావురాల గుట్ట చిచ్చు’.. ఆ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలతో రగడ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) మధ్య సోషల్ మీడియా వార్ (Social Media War) మొదలైంది. బీఆర్ఎస్ 2025 మోడల్ అంటూ ఆ పార్టీ సానుభూతిపరులు చేసిన పోస్టుపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన కామెంట్ వివాదాస్పదం అయింది. బీజేపీ నేత తీరుపై గులాబీ పార్టీ సానుభూతిపరులు మండిపడుతున్నారు. దీంతోనా వాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుంటే దానికి నేను బాధ్యుడిని కాదు అంటూ సదరు బీజేపీ నేత కౌంటర్ ఇవ్వగా ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

పయనం సీదా పావురాల గుట్టకే:

ఇటీవల ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభకు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారు హెలికాప్టర్ మాదిరిగా గాల్లో దూసుకుపోతున్నట్లుగా ఆ కారును కేసీఆర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ 2025 మోడల్ (BRS 2025 Model) అని పేర్కొంటూ ఉన్న కార్టూన్ ను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ షేర్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిషోర్.. 'పయనం సీదా పావురాల గుట్టకే' అని కామెంట్ చేశారు. మరి కొన్ని గంటల తర్వాత మరో కామెంట్ చేస్తూ పయనం సీదా పావురాల గుట్టకే అని నేను అన్నది బీఆర్ఎస్ గురించి మాత్రమేనని ఏ వ్యక్తి గురించి అనే కుసంస్కారిని కాదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే పోరెడ్డి కిషోర్ రెడ్డి చేసిన పావురాల గుట్ట కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.

మీకన్నా పది రెట్ల సైన్యం మాకుంది:

కిశోర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. 'ఇతను బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అంట.. ఇతర పార్టీల నాయకుల చావును కోరుకుంటూ ఇటువంటి పోస్టులు పెట్టడం ఎవరు నేర్పిన సంస్కారం? మీ పార్టీలోనూ నాయకులు ఉన్నారు. దేశంలో చాలా గుట్టలు ఉన్నాయి. కౌంటర్ పోస్టులు పెట్టడానికి పది రెట్ల సైన్యం మాకు ఉన్నది. కానీ పెట్టకపోవడానికి మాకు సంస్కారం అడ్డు వస్తున్నది' అంటూ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ జగన్ కౌంటర్ ఇచ్చారు. మరి కొంత మంది బీఆర్ఎస్ సానుభూతిపరులు సైతం కిశోర్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. దీంతో మరోసారి స్పందించిన కిశోర్ పోరెడ్డి.. ఇప్పటికీ మీరు ఇది కేసీఆర్ గురించి అనుకుంటే అది మీ ఆలోచన. నాది కాదు. మీ ఆలోచనలకు నేను బాధ్యుడిని కాదు అంటూ బదులిచ్చారు. దీంతో ఇరు పార్టీల నెటిజన్ల మధ్య సోషల్ మీడియాలో కౌంటర్లు ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతోంది.

Next Story