- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా పిచ్చిమాలోకాలు! విధులకు ఆటకం కలిగిస్తే కఠిన చర్యలే: వీసీ సజ్జనార్ హెచ్చరిక
సామాజిక మాధ్యమాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం చెత్త కంటెంట్‌తో చాలా మంది రీల్స్ చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Social media) సామాజిక మాధ్యమాల్లో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం చెత్త కంటెంట్‌తో చాలా మంది (Instagram Reels) రీల్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తూ కొంత మంది రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే పబ్లిక్ న్యూసెన్స్ ప్రాంక్స్ చేసి రీల్స్ చేసిన వారిని వివిధ రాష్ట్రాల్లో పోలీసుల దృష్టికి రావడంతో అరెస్ట్‌లు సైతం చేస్తున్నారు. అయిన కూడా ఇలాంటి వీడియోలు తీయడం మానటంలేదు. ఈ నేపథ్యంలో ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్‌తో ఓ యువకుడు ప్రవర్తించిన తీరు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సిటీ బస్సు ఆర్టీసీ కండక్టర్‌తో యువకుడు ఓ ప్రాంక్ వీడియో చేస్తాడు. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC Sajjanar) ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇదేం వెర్రి కామెడీ.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా అని సజ్జనార్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తారా..? అని నిలదీశారు. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే (TGSRTC) టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని హెచ్చరించారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో చేసిన యువకుడిని అరెస్ట్ చేయాలని, ఒకడికి కరెక్ట్‌గా శిక్ష పడితే వాన్ని చూసి ఇంకా ఎవరకు ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసే రీల్స్ చేయరని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.






