- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sajjanar : సోషల్ మీడియా బెట్టింగ్ రాయుళ్లతో జాగ్రత్త : సజ్జనార్
ఆన్ లైన్..సైబర్ మోసాల పట్ల నిరంతరం ప్రజలను జాగరుకులను చేసే టీజీ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ.సజ్జనార్(Sajjanar) సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల బెట్టింగ్..షాపింగ్(Social Media Influencers Betting..Shopping)వీడియోలపై ఎక్స్ వేదికగా హెచ్చరికలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్..సైబర్ మోసాల పట్ల నిరంతరం ప్రజలను జాగరుకులను చేసే టీజీ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ.సజ్జనార్(Sajjanar) సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల బెట్టింగ్..షాపింగ్(Social Media Influencers Betting..Shopping)వీడియోలపై ఎక్స్ వేదికగా హెచ్చరికలు చేశారు.
చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో! అంటూ అలా షాప్ కి వెళ్లి..అక్కడే బెట్టింగ్ పెట్టి..వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అని మాయమాటలు చెప్పే బెట్టింగ్ మోసగాళ్ల వీడియోను పోస్టు చేశారు. సులువుగా బెట్టింగ్ తో వస్తువులు కొనుగోలు చేసుకొవడమనే..ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండని? ప్రశ్నించారు. ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు.
మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదన్నారు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండని ప్రజలను సజ్జనార్ హెచ్చరించారు.






