తెలంగాణ అసెంబ్లీలో షాకింగ్ ఘటన.. పోలీసులు సైతం భయంతో పరుగులు

by Gantepaka Srikanth |

పాత శాసనమండలి (Old Legislative Council) భవన ప్రాంగణంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది.

తెలంగాణ అసెంబ్లీలో షాకింగ్ ఘటన.. పోలీసులు సైతం భయంతో పరుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: పాత శాసనమండలి (Old Legislative Council) భవన ప్రాంగణంలో మంగళవారం ఒక్కసారిగా కలకలం రేగింది. భవన ఆవరణలో ఒక భారీ పాము ప్రత్యక్షం కావడంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు.

భయంతో పరుగులు తీసిన సిబ్బంది..

మంగళవారం మధ్యాహ్నం భవనంలోని ఒక మూల పాము పాకుతూ రావడాన్ని గమనించిన సిబ్బంది ఒక్కసారిగా కేకలు వేశారు. పాము ఎటువైపు వస్తుందో తెలియక అక్కడున్న వారు అప్రమత్తమై పరుగులు తీశారు. అధికారులకు సమాచారం అందించే లోపే, అక్కడ డ్యూటీలో ఉన్న మలక్ పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ రంగంలోకి దిగారు. ఎటువంటి భయం లేకుండా, అత్యంత చాకచక్యంగా ఆ పామును వెంకటేష్ నాయక్ పట్టుకున్నారు. పాముకు ఎలాంటి గాయం కాకుండా, అలాగే అక్కడ ఉన్న వారికి ప్రమాదం కలగకుండా ఆయన దానిని బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంకటేష్ నాయక్‌కు పాములను పట్టడంలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో జనావాసాల్లోకి వచ్చిన పాములను ఆయన పట్టుకుని, సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టి తన మానవత్వాన్ని, ధైర్యాన్ని చాటుకున్నారు.

వెల్లువెత్తుతున్న అభినందనలు..

విషపూరితమైన పాము అని తెలిసినా, ప్రాణాలకు తెగించి సకాలంలో స్పందించిన వెంకటేష్ నాయక్‌ను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. "పోలీసు విధులతో పాటు ఇలాంటి సామాజిక బాధ్యతను, సాహసాన్ని ప్రదర్శించడం గర్వకారణం" అని తోటి సిబ్బంది కొనియాడారు. పట్టుకున్న పామును అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించడమో లేదా సురక్షిత ప్రాంతంలో వదిలివేయడమో జరుగుతుందని పోలీసులు తెలిపారు. వీడియో

Next Story