కోర్టు మెట్లెక్కిన స్మితా సబర్వాల్.. ఏం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) కోర్టు మెట్లెక్కారు.

కోర్టు మెట్లెక్కిన స్మితా సబర్వాల్.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) కోర్టు మెట్లెక్కారు. మంగళవారం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌(PC Ghosh Commission) నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్‌ పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. మూడు బ్యారేజీల నిర్మాణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. పర్యవేక్షణ, నాణ్యతలోనూ నా పాత్ర లేదు. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే నా బాధ్యత. జిల్లాల పర్యటనలకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే నాకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది.

Next Story