- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smita Sabharwal: ఇంకా 30 రోజులే మిగిలింది! స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ -2025 (Miss World 2025) పోటీల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ -2025 (Miss World 2025) పోటీల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం స్వాగత ఏర్పాట్లపై మంగళవారం చార్మినార్ సమీప ప్రాంతంలోని (Chowmohalla) చౌమొహల్లా ప్యాలెస్‌లో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే స్మితా సబర్వాల్ బుధవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘మిస్‌వరల్డ్ పోటీల నేపథ్యంలో కొన్ని రోజులు నాకు ఉత్తమ ఉద్యోగం ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్ వద్ద మిస్‌వరల్డ్-2025 ఈవెంట్ కోసం మా టీమ్‌ను వెల్కమ్ గాలా డిన్నర్ కోసం సిద్ధం చేస్తున్నాను. గ్రాండ్ ఓపెనింగ్ (Opening Ceremony) వేడుకలకు ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ సిద్ధంగా ఉన్నారు’ అని ఫోటోలు షేర్ చేశారు. కాగా, మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొనే వారు మే 6, 7న హైదరాబాద్‌కు రానున్నారు. కాగా, తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చార్మినార్ కట్టడం వద్ద హెరిజేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్‌లో వెల్కమ్ డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నారు.






