విద్యుత్ ఆదాకు స్మార్ట్ సొల్యూషన్స్

by Gantepaka Srikanth |

విద్యుత్ ఆదాకు స్మార్ట్ సొల్యూషన్స్

విద్యుత్ ఆదాకు స్మార్ట్ సొల్యూషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరెంట్ బిల్లులు తగ్గించేందుకు, విద్యుత్ ఉపకారణాలను అందుబాటులోకి తెచ్చినట్టు భారత్ స్మార్ట్ సర్వీసెస్ స్టార్టప్ సంస్థ సీఈవో శికందర్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీస్, ఇండ్లల్లో విద్యుత్ ఆదా చేసేలా తమ స్మార్ట్ డివైజ్ తమ ఉత్పత్తులను వాడటం వల్ల విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు పర్యావరణ రక్షణలో పాటు పడాలన్నారు. ఐదు రాష్ట్రాల డిస్కమ్‌లతో కలిసి పనిచేస్తున్నామన్నారు. భారతదేశంలో వ్యాప్తగానాగ్ 5 కోట్ల బిల్లులను సేవ్ చేశామని తెలిపారు.

శుక్రవారం అమీర్పేట్ మెట్రో స్టేషన్‌లో భారత్ స్మార్ట్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో క్లయిమేట్ యోధ పేరుతో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ఆదా చేయడం తెలంగాణ విజన్ 2047 నెట్ జీరో అచీవ్ చేసేందుకు ప్రతి ఒక్కరూ విద్యుత్ అదా చేసి పర్యావరణ రక్షణలో భాగం కావాలన్నారు. రాష్ట్ర పరిశ్రమాల్లో, గృహలో తమ స్మార్ట్ డివైజ్ ఉపయోగిస్తూ.. ప్రతి నెల 25 లక్షల్లు బిల్లులు సేవ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఒరిస్సా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్టర్ తమ సర్వీస్ అందిస్తున్నట్టు తెలిపారు. టాటా పవర్‌తో అనుసంధానమై విద్యుత్ ఆదా చేసే సర్వీస్‌లను అందిస్తున్నాం అన్నారు. ప్రతి ఒకరి గృహలో విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం పెరిగిందని, కరెంట్ బిల్లులు తగ్గించే దుకు ఇలాంటి స్మార్ట్ డివైజ్‌లను వాడాలని కోరారు సంస్థ నిర్వాహకులు. ఈ సందర్బంగా సాండ్ ఆర్ట్ ద్వారా విద్యుత్ ఆదా, పర్యావరణ రక్షణపై ప్రధారణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

Next Story