- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్ గ్రూపులపై హ్యాకర్ల దాడి.. లింకులు ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్
బోథ్ నియోజకవర్గానికి చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, బోథ్: బోథ్ నియోజకవర్గానికి చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. "SBI REWARDZ" పేరిట వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌లు, లింకులు, APK ఫైళ్లు, PDF లు వల్ల చాలా గ్రూపులు హ్యాక్ అయినట్లు సమాచారం. గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చిన ఈ మెసేజ్‌లు ఓపెన్ చేసిన కొందరి ఫోన్లు హ్యాక్ అయ్యాయని పలువురు సభ్యులు తెలిపారు.
గ్రూపుల పేర్లను కూడా మార్చి “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా”గా ఉంచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. లింక్‌లను టచ్ చేయడం వల్ల ఫోన్లలో ఉన్న వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద లింక్ వచ్చితే ఓపెన్ చేయకుండా ఉండాలని, అలాంటివి తక్షణమే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు. అంతేగాక, అనుమానితులు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగితే చెప్పకూడదని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.






