TG: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష షెడ్యూల్ లో మార్పు

by Prasad Jukanti |

ఇంటర్ పరీక్షల విషయంలో ఇంటర్మిడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది.

TG: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష షెడ్యూల్ లో మార్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో ఇంటర్ బోర్డు స్వల్ప మార్పులు (Telangana Inter Exams Schedule Change) చేసింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మరుసటి రోజు (మార్చి4న) నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 3వ తేదీన హోలీ పండగ ఉండటంతో పరీక్షల తేదీల్లో మార్పు చేసినట్టు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొంది. కాగా ఇంటర్ రాత పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరగనున్న ప్రాక్టికల్స్ లో ఎలాంటి మార్పులు లేవు.

Next Story