- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ఆ బస్సులు రోడ్లపై తిరగకూడదు.. రాష్ట్రాలకు ఎన్‍హెచ్‍ఆర్‍సీ ఆదేశాలు
స్లీపర్ బస్సులు ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో ఎన్‍హెచ్‍ఆర్‍సీ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ లోని జైసల్మేర్-జోధ్ పూర్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది, మృతి చెందగా ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకుని 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదాలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో భారతీయ జాతీయ మానవ హక్కుల కమిషన్ ధర్మాసనం శనివారం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని ప్రియాంక్ కనూంగో నేతృత్వంతోని ఎన్‍హెచ్‍ఆర్‍సీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చింది.
రాజస్థాన్ బస్సు అగ్ని ప్రమాదంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేసాల మేరకు సెంట్రల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ (CIRT) చేసిన దర్యాప్తులో బస్సు AIS-052, AIS-119 అనే తప్పనిసరి భద్రతా ప్రమాణాలకు వ్యతిరేకంగా తయారు చేసినట్లు తేలింది. ఇందులో ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్ లేకపోవడం, డ్రైవర్ క్యాబిన్ కు ప్రయాణికుల క్యాబిన్ కు పూర్తిగా మూసివేసి ఉండటం వల్ల వెనుక భాగంలో ఏం జరుగుతోందని డ్రైవర్ గుర్తించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. అలాగే స్లీపర్ బెర్త్ లపై తప్పు స్లైడర్లు, సరిపడ ఎమర్జెన్సీ డోర్లు లేకపోవడం వంటి పెద్ద లోపాలను ఈ నివేదిక ఎత్తి చూపింది. దీంతో ఈ తప్పులు పూర్తిగా నివారించదగినవి అని పేర్కొన్న ఎన్‍హెచ్ఆర్‍సీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.






