- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC టన్నెల్ ప్రమాద ఘటన.. సీఎస్‌పై NHRC సీరియస్
SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మనోజ్ కుమార్, గురుప్రీత్ సింగ్‌ల మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. అయితే, మృతదేహాల బయటకు తీయండంలో ఎలాంటి పురోగతి లేదని కాలయాపన చేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని (Ramarao Immaneni) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చపట్టిన ఎన్‌హెచ్ఆర్‌సీ, SLBC ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని నాటి సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సీఎస్, ఇరిగేషన్ శాఖకు డీటెయిల్ రిపోర్టు ఇవ్వాలని లేఖ రాయగా.. వారు ఇచ్చిన రిపోర్టునే జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందజేశారు. దీంతో ఆ రిపోర్టు సంతృప్తికరంగా లేదని ఎన్‌హెచ్ఆర్‌సీ కామెంట్ చేసింది.
ఈ ప్రమాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్, జమ్మూకశ్మీర్‌కు చెందిన సన్నీ సింగ్, జార్ఖండ్‌కు చెందిన సందీప్ సాహు, జగ్తా, సంతోష్ సాహు, అనుజ్ సాహు అనబడే కార్మికులు గల్లంతయ్యారని ఎన్‌హెచ్ఆర్‌సీ పేర్కొంది. అసంఘటిత కార్మికుల సంరక్షణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందని, మృతదేహాల వెలికితీతలో పారదర్శక పూర్తిగా లొపించిందని అభిప్రాయడింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల నియంత్రణ, పని పరిస్థితుల చట్టాలను విస్మరించిన ఫైర్ అయింది. ప్రభుత్వ జాప్యం వల్లే అంచనా వేయడం, నివారణ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కామెంట్ చేసింది. ఈ మేరకు SLBC ప్రమాద ఘటనపై అత్యవసర చర్యలు చేపట్టి నాలుగు వారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావును ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించింది.






