Ponguleti: మరో 15 రోజుల్లో ఎస్ ఎల్ బీసీ సహాయక చర్యలు పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Prasad Jukanti |

ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద అత్యాధునిక పరికరాలతో 560 మంది సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Ponguleti: మరో 15 రోజుల్లో ఎస్ ఎల్ బీసీ సహాయక చర్యలు పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్/అచ్చంపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచనల మేరకు ఎస్ఎల్ బీసీ టన్నెల్ (SLBC Tunnel) వద్ద సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని మరో 10-15 రెస్క్యూ పనులు పూర్తవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ఇవాళ ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. అనంతరం శ్రీశైలంలో విలేకరులతో మాట్లాడారు. గడిచిన 40 రోజులుగా దాదాపు 800 మంది వివిధ సంస్థలకు చెందిన నిపుణులు పగలు రాత్రి సహాయక చర్యల్లో (Rescue Operation) పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 550-560 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యల్లో ఉన్నారని, టెన్నెల్ లో భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర వస్తువులు అతుక్కుపోవడం వల్ల అక్కడ బురద తొలగింపు కష్టసాధ్యం, ప్రమాదకరంగా మారిందన్నారు.

ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయని మిగిలిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా కలెక్టర్ కు ఆదేశాలు అందాయన్నారు. భవిష్యత్ లో ఎలాంటి నష్టం జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడతామని మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయక చర్యల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కలెక్టర్, ప్రత్యేక పర్యవేక్షణాధికారి, విపత్తు నిర్వహణాధికారి, ఎస్పీ తదితరులు అన్ని వేళలా అందుబాటులో ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు.

Next Story