SLBC : ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం.. టన్నెల్ వద్ద పోలీసు ఆంక్షలు

by Y. Venkata Narasimha Reddy |

మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం(BRS Team) ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel Incident)ప్రమాద స్థలి సందర్శనకు బయలుదేరిన నేపథ్యంలో టన్నెల్ వద్ద పోలీసులు ఆంక్షలు(Police Restrictions)విధించారు

SLBC : ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం.. టన్నెల్ వద్ద పోలీసు ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం(BRS Team) ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel Incident)ప్రమాద స్థలి సందర్శనకు బయలుదేరిన నేపథ్యంలో టన్నెల్ వద్ద పోలీసులు ఆంక్షలు(Police Restrictions)విధించారు. హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తుున్నారు.

బీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకునేందుకు టన్నెల్ నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. మీడియా, పొలిటికల్ లీడర్స్ ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాత్రం తమను టన్నెల్ వద్ధకు అనుమతించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో ఫెయిల్యూర్ వంటి అంశాలు బయటికి వస్తాయనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం సూచనలు ఇవ్వమన్నందునా ప్రమాదాన్ని పరిశీలించిన సూచనలు ఇచ్చేందుకే సందర్శనకు వెళ్తున్నామని..అడ్డుకునే ప్రయత్నాలు సరికాదని..అలాంటప్పుడు సూచనలు ఇవ్వమని ఎవరు పిలవమన్నారు? అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.

ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి కారణం నీటి ఊటనే అని వెల్లడించారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదని తెలిపారు. నేను విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్ళారా చూసానని చెప్పారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు.

నాడు సమైక్యాంద్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని, టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారని, ఓ మంత్రి వాటర్ లో నీళ్ళు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమెడియన్ అయ్యాడని, గోడకు చెవులు పెట్టడం...సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని మంత్రి కోమటిరెడ్డిని ఎద్దేవా చేశారు.

Next Story