SLBC ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే.. పరిశీలనకు బయలుదేరిన సీఎం, మంత్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-03 10:46:31  IST  )

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ అడుగు ముందుకు వేసింది.

SLBC ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే.. పరిశీలనకు బయలుదేరిన సీఎం, మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు ఇవాళ నీటిపారుదల శాఖ టన్నెల్ వద్ద ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో నగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని మన్నెవారిపల్లికి బయలుదేరారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఉన్నారు. అక్కడ హెలీ మాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్.. అందులో ఉన్న అధునాతన పరికరాలను సీఎంతో పాటు మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే రేవంత్ రెడ్డి జెండా ఊపి సర్వే హెలికాప్టర్ టేకాఫ్‌కు సిగ్నల్ ఇస్తారు. మన్నెవారిపల్లె సమీపంలో SLBC అవుట్‌లెట్ వైపు నుంచి సర్వే ప్రారంభం కానుంది. సీఎం, మంత్రులు ఉన్న హెలికాప్టర్ కూడా సర్వే హెలికాప్టర్‌తో పాటు బయలుదేరి సమాంతరంగా కొన్ని కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని సీఎం పరిశీలిస్తారు. అయితే, NGRI ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే జరుగుతుంది. భూమిలో వెయ్యి మీటర్ల లోతు వరకు జియాలజికల్ డేటాను నిపుణులు సేకరిస్తారు. భూమి లోపల ఉండే షీర్ జోన్లు, నీటి ప్రవాహాలను గుర్తించేందుకు చేపట్టేదే ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే.

READ MORE ...

రెండేళ్లలో SLBC పూర్తి చేస్తాం: CM రేవంత్ రెడ్డి

Next Story