- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు(Huge Investments in Telangana) పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పెట్టుబడులు(Huge Investments in Telangana) పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. మంగళవారం దావోస్(Davos)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమక్షంలో స్కైరూట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ(Skyroot Company) దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కాగా.. ఈ ఒప్పందం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌ను ప్రయివేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్రబింధువుగా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు సాధించటం గర్వంగా ఉందన్నారు. కాగా, ఇప్పటికే ప్రముఖ బహుళజాతి సంస్థ యూనిలివర్ కంపెనీ(Unilever Company) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ సీఈవో హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చెయిన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థ అంగీకరించింది.






