భారీ ఎన్‌కౌంటర్‌: మృతిచెందిన మావోయిస్టులు వీళ్లే!

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

భారీ ఎన్‌కౌంటర్‌: మృతిచెందిన మావోయిస్టులు వీళ్లే!
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతిచెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మద్దేడు ఏరియా కమిటీ ఇంచార్జ్ బుచ్చన్న, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిల ఉన్నట్లు తెలిసింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Next Story