ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు

by Naga Rani Yarlagadda |

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు సిట్ విచారణకు హాజరయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా.. సిట్ ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని విచారణకు రావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. దీంతో బంజారాహిల్స్ లోని ఐసీసీసీ కార్యాలయంలో విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సిట్ అనేక మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించిన సిట్.. ఎన్నికల సమయంలో వీరిద్దరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉండగా.. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఒకసారి విచారణకు రావాలని నోటీసులివ్వగా.. అనివార్యకారణాలతో హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి.. సిట్ అధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వీరిద్దరూ చేసిన కంప్లైంట్ల ఆధారంగా సిట్ విచారణ చేసింది. ఈ క్రమంలో సేకరించిన ఎవిడెన్స్ ను వారిద్దరి ముందు ఉంచి ప్రశ్నిస్తోంది. విచారణలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చే స్టేట్మెంట్ ను సిట్ రికార్డు చేయనుంది. సిట్ విచారణ అనంతరం యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉండగా.. వారిద్దరూ ఏం చెప్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Next Story