ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక చర్యలు..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-10 16:21:49  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక చర్యలు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటిరియమ్ ప్రోటక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. సిట్ అధికారులు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లిహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లీనట్ల సమాచారం. ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరిగితే కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూస్తాయని సిట్ అధికారులు తెలుపుతున్నారు. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలో ఆగస్టు ఐదు వరకు అరెస్టు చేయవద్దని ఉంది. కేసు దర్యాప్తులో ఇప్పటికే అలస్యం అయిందని సిట్ అధికారులు బావిస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తేనే కేసు కొలిక్కి వస్తుందిని సిట్ అధికారులు కోర్టుకు వివరించినట్లు తెలుస్తుంది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించలేదని , ఇప్పిటికే ఐదు సార్లు విచారించినట్లు తెలుపుతున్నారు.

బుధవారం ప్రభాకర రావుకు సబంధించిన ల్యాప్ ట్యాప్, ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ సమయంలో ప్రభాకర్ రావు వినియోగించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ తాను అమెరికాలో మరిచి పోయినట్లు ప్రభాకర్ రావు చెబుతున్నారని సిట్ అధికారులు తెలుపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో మరో నిందితుడిగా పేర్కోన్న శ్రవణ్ రావు కూడా సుప్రీంకోర్టు ఇంటిరియమ్ ప్రోటెక్షన్ గడువు ఉన్నంత కాలం సిట్ అధికారుల విచారణకు సహకరించలేదు.

Next Story