ఎమ్మెల్యే ఏలేటికి సిట్ నోటీసులు.. విచారణకు రాలేనని బదులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-05 13:05:22  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సాక్షుల స్టేట్‌మెంట్లను సిట్ (SIT) అధికారులు సమగ్రంగా సేకరిస్తున్నారు.

ఎమ్మెల్యే ఏలేటికి సిట్ నోటీసులు.. విచారణకు రాలేనని బదులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సాక్షుల స్టేట్‌మెంట్లను సిట్ (SIT) అధికారులు సమగ్రంగా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. అందులో ఇప్పటికే 236 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు 2023 ఎన్నికల సమయంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) ఫోన్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఆయనకు శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేశారు. అందులో ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కానీ, అనూహ్యంగా మహేశ్వర్ రెడ్డి నేడు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు రాలేనని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఇవాళ వీలుపడదంటూ అధికారులకు కబురు పంపారు. దీంతో బుధవారం లేదా శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఏలేటికి తెలిపారు.

Next Story