- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CID దర్యాప్తు వేగం.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో గంటపాటు రానాను విచారించిన సిట్!
బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు వేగం పెరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ కేసులో భాగంగా శనివారం టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati), యాంకర్ విష్ణు ప్రియలు సిట్ విచారణకు హాజరయ్యారు. వేర్వేరుగా ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్లు తెలిసింది. సుమారు గంటపాటు సాగిన విచారణలో అధికారులు యాప్‌ల ప్రచారానికి సంబంధించిన ఒప్పందాలు, చెల్లింపులు, ప్రమోషన్ విధానాలపై రానాను ప్రశ్నించినట్లు సమాచారం. రానా 2017లో బెట్టింగ్, గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు సమాచారం. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని ఇప్పటికే రానా సీఐడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ కేసులో ఇటీవల ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు తదితర సినీ ప్రముఖుల స్టేట్‌మెంట్లు సిట్ రికార్డు చేసిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌ల పెరుగుతున్న నిర్వాకాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ ఏర్పాటు చేశారు. కాగా, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల వద్ద నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ముందుకు సాగుతున్న ఈ దర్యాప్తులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు అయ్యాయి. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి లు ఈ జాబితాలో ఉన్నారు.






