- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch Elections: సర్పంచ్ బరిలో సోదరుడు.. ఎలక్షన్ ఆఫీసర్‍గా సోదరి.. గ్రామంలో వివాదం
ఎన్నికల అధికారిణి వల్లే తాము ఓడిపోయామని అభ్యర్థులు ఉన్నాతాదికారులకు ఫిర్యాదు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం శేరిగూడలోఎన్నికల నిర్వహణ వివాదాస్పదం అయింది. ఇక్కడ ఎన్నికల ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే ఎన్నికల అధికారిణిగా సర్పంచ్ అభ్యర్థి సోదరి పని చేయడం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారంపై అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి సోదరి అనిత పోలింగ్ ఆఫీసర్‍గా విధులు నిర్వహించారు. అయితే శేరిగూడ సర్పంచ్‍గా అనిత సోదరుడే గెలిచాడని అనిత వల్లే తాము ఓడిపోయామని ఓడిన అభ్యర్థులుపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల్లో ముందుగా అనిత పేరు లేదని, పేరు లేకపోయినా ఎంపీడీవో ఆఫీసు నుంచి నేరుగా పంపారని ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు మౌనిక, గంగాభవానిలు ఫిర్యాదు చేశారు. ఆర్డర్ కాపీ లేకుండా విధుల్లో పాల్గొనటంపై ఎంపీడీవోను అభ్యర్థులు నిలదీశారు.






