Mohammed Siraj : సిరాజ్ బాయ్ ప్రేమలో పడ్డాడు !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-26 06:57:34  IST  )

టీమిండియా స్టార్ క్రికెటర్ (Indian Cricketer) , డీఎస్పీ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ప్రేమలో పడ్డాడన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సింగర్ జనై బోస్లే(Zanai Bhosle), తన బర్త్ డే వేడుకలో మహ్మద్ సిరాజ్ తో దిగిన ఫోటో కారణమైంది.

Mohammed Siraj : సిరాజ్ బాయ్ ప్రేమలో పడ్డాడు !
X

దిశ, వెడ్ డెస్క్ : టీమిండియా స్టార్ క్రికెటర్ (Indian Cricketer) , డీఎస్పీ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ప్రేమలో పడ్డాడన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సింగర్ జనై బోస్లే(Zanai Bhosle), తన బర్త్ డే వేడుకలో మహ్మద్ సిరాజ్ తో దిగిన ఫోటో కారణమైంది. జనై బోస్లే ఇన్ స్టాలో సిరాజ్ తో ఉన్న ఫోటోను పోస్టు చేయడంతో నెటిజన్లు మన డీఎస్పీ(DSP) సాబ్ ప్రేమలో పడ్డారంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రముఖ గాయని ఆశాబోస్లే మనవరాలై(Granddaughter of Asha Bhosle)న జనై బోస్లే ముంబైలోని బాంద్రాలో జరుపుకున్న తన 23వ పుట్టినరోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో సిరాజ్‌తో కలిసి ఆమె దిగిన ఒక ఫోటో డేటింగ్ పుకార్లను రేకెత్తించింది. వారి మధ్య స్నేహామేనా ఇంకేమైనా ఉందా అని నెటిజన్లు చర్చోపచర్చలు సాగిస్తున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుండడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో సిరాజ్ తో పాటు మరో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas), నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff ) అయ్యారు కూడా హాజరయ్యారు.

తమ ఫోటోపై నెట్టింట వెల్లువెత్తుతున్న పుకార్లపై జనై, సిరాజ్ లు మాత్రం స్పందించలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు జనై బోస్లే కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు నెటిజన్లు జనై 'బాబీ' మీరు సిరాజ్ భాయిజాన్‌ని పెళ్లి చేసుకోబోతున్నారా?" అని చమత్కరించగా.. మరొకరు "డీఎస్పీ సాబ్..యహా మే పిగల్ గయా." వ్యాఖ్యానించాడు.

రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌లో చేరడాన్ని ప్రస్తావిస్తూ బాబీ నే సిర్ఫ్ గుజరాత్ టైటాన్స్ కో ఫాలో కియా, క్యుకి డీఎస్పీ హై ఇస్ బార్ గుజరాత్ మీ" అని మరొకరు కామెంట్లు పెట్టారు.

Next Story