- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సింగర్ సునీత భర్త కంప్లైంట్
తనకు, తన కుటుంబ సభ్యులకు ఓ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని సింగర్ సునీత భర్త రామకృష్ణ కంప్లైంట్ చేయడం కలకలం రేపింది

X
దిశ, వెబ్‌డెస్క్: తనకు, తన కుటుంబ సభ్యులకు ఓ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని సింగర్ సునీత భర్త రామకృష్ణ కంప్లైంట్ చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో నివసించే రామకృష్ణ ఫోన్‌కు గతేడాది ఓ మెసెజ్ వచ్చింది. ఆ వ్యక్తి తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ నని తన పేరు కే.కే. లక్ష్మణ్ అని తెలిపాడు. పర్సనల్ గా కలవాలని కోరగా రామకృష్ణ తిరస్కరించారు. తరచూ మెసెజ్ లు చేస్తుండటంతో నంబర్ బ్లాక్ చేశాడు. ఈ క్రమంలో మార్చి 28న మరో కొత్త ఫోన్ నంబర్ తో మెసెజ్ లు చేయడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో శనివారం రాత్రి సింగర్ సునీత భర్త రామకృష్ణ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story






