భట్టి విక్రమార్కని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. విషయం ఇదే

by Ramesh Naini |

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

భట్టి విక్రమార్కని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. విషయం ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజాగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న జరిగే తన వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క.. రాహుల్ సిప్లిగంజ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి తన వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కాగా, రాహుల్‌ సిప్లిగంజ్‌కు హరిణ్య రెడ్డితో ఆగస్టులో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Next Story