Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్..

by Ramesh Naini |   (  Updated:2025-08-14 08:18:36  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు.

Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Singer Rahul Sipligunj) భేటీ అయ్యారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో ఆయనను రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్‌ను శాలువ కప్పి సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో రాహుల్‌తో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో తను పాడిన ‘నాటు నాటు’ సాంగ్‌‌కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశవ్యాప్తంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాపులర్ అయ్యారు. ఆ ఒక్క పాటతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. అయితే, 2023లో ఓ ప్రోగ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై 20న పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ సర్కార్ రూ.కోటి ప్రోత్సాహకం ప్రకటించింది.

Also Read..

మహేష్ బాబు మరదలికి చేదు అనుభవం.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్

Next Story