Rahul Sipligunj: రేవంతన్నా.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు.

Rahul Sipligunj: రేవంతన్నా.. అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గురువారం ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) భేటీ అయ్యారు. భేటీ అనంతరం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నాలాంటి కళాకారులని గుర్తు పెట్టుకుని, అక్కున చేర్చుకుని, అందరికీ ప్రేరణగా నిలుస్తూ ఎంతో ఉత్సాహాన్ని అందిస్తున్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. రేవంతన్నా మీరు ఇచ్చే ప్రోత్సాహం మరువలేనిదని కొనియాడారు.

అలాగే ప్రత్యేకంగా.. నన్ను సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఎంతగానో ప్రోత్సహించిన మా రోహిన్‌రెడ్డి అన్నకి, నన్ను అభినందించిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నకి, ఎమ్మెల్యే జయవీర్ అన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంతో దిగిన ఫోటోలను రాహుల్ పోస్ట్ చేశారు. కాగా, ఇటీవల పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్‌కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎంతో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story