Singer Kalpana: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌‌ను కలిసిన సింగర్‌ కల్పన.. వారిపై ఫిర్యాదు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-08 12:43:29  IST  )

టాలీవుడ్ (Tollywood) సీనియర్ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వదంతులు రాష్ట్రంలో కలకలం రేపాయి.

Singer Kalpana: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌‌ను కలిసిన సింగర్‌ కల్పన.. వారిపై ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ (Tollywood) సీనియర్ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే వదంతులు రాష్ట్రంలో కలకలం రేపాయి. స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోసేజ్‌ కారణంగా రెండ్రోజుల పాటు బెడ్ రూంకే పరిమితమైన ఆమెను కాలనీవాసులు పోలీసుల సాయంతో ఈనెల 4న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం రాత్రి స్పృహలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆమె తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌‌ నేరళ్ల శారద (Neralla Sarada)ను కలిశారు. స్లీపింగ్ పిల్స్ మింగి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానంటూ కొందరు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కమిషన్ సభ్యుల దృష్టి తీసుకెళ్లారు. అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ (YouTube Channels) పనిగట్టుకుని తన ప్రైవేటు వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సింగర్ కల్పన (Singer Kalpana) మహిళా కమిషన్ చైర పర్సన్ నేరెళ్ల శారదను కోరారు.

అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు.. నేరెళ్ల శాదర

సోషల్ మీడియా (Social Media) వేదికగా మహిళలను ట్రోల్ చేసే వారికి తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరళ్ల శారద (Neralla Sarada) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్స్ పెడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఆ విషయాన్ని ట్రోలర్స్ దృష్టిలో పెట్టుకోవాలని నేరళ్ల శారద అన్నారు.

సింగర్ కల్పన వీడియో విడుదల..

ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన సింగర్ కల్పన సోషల్ మీడియా (Social Media) వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. అయితే, ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ.. తన గురించి అదేవిధంగా తన భర్త గురించి న్యూస్‌, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యూలేట్ అవుతున్నాయని అన్నారు. 45 ఏళ్లు వచ్చిన తను పీహెచ్‌డీ (PHD)తో పాటు ఎల్‌ఎల్‌బీ (LLB) చేస్తున్నానని అన్నారు. అన్ని తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లే సాధ్యం అవుతోందని తెలిపారు. మరోవైపు మ్యూజికల్ కాన్సర్ట్స్‌ (Musical Concerts)లో పాల్గొంటున్నానని అన్నారు. ఒకేసారి అన్ని పనుల చాలా కాలంగా తనకు నిద్ర కరువైందని.. వైద్యుడి వద్ద ఇన్సోమియా (Insomnia) ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపారు. అందులో ఉన్న ఓ మెడిసిన్ కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నా కాబట్టే స్పృహ కోల్పోయానని క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని.. మీడియాతో పాటు సోషల్ మీడియా (Social Media)లో వచ్చే వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story