- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Singareni: రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి భారీ ఒప్పందం.. ఆ ప్రాజెక్టులపై ఎంఓయూ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో సింగరేణి వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో సింగరేణి (Singareni) వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తోంది. సోమవారం (Rajasthan) రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై సింగరేణి చరిత్రాత్మక ఒప్పందం చేసుకోనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma), తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka Mallu) సమక్షంలో ఎంఓయూ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ రాజస్థాన్ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రాజస్థాన్‌లో ఎంఓయూ చేసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
రాజస్థాన్ విద్యుత్ శాఖ అనుబంధ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయబోతుంది. జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు ఒప్పందం కుదుర్చుకోకున్నట్లు అధికారుల సమాచారం. ఇది సింగరేణి ఆర్థిక పరిపుష్టికి అతి పెద్ద అవకాశమని తెలిపారు. మొత్తం వ్యయం, లాభాల్లో 74 శాతం సింగరేణి, 26 శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్‌కు వాటా ఉంటుంది. తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు పొందుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.






