- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ పాలన భేష్ : సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్
సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ పేర్కొంది. నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం అయిన అసోసియేషన్.. రేవంత్ పాలనలో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలియజేస్తూ.. పోస్టర్లు విడుదల చేసారు. 1991లో జీఓ నెం.310 ప్రకారం.. 1994లో సింగరేణి సంస్థ వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుందని, అయితే భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, భూమి విలువ చెల్లించాల్సిన నిబంధనలను అమలు చేయలేదన్న సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగంటి రాములు ఆవేదన వ్యక్తం చేసారు.
దీనిపై 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించామని.. 2013లో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ సర్కారు తీర్పును అమలు చేయలేదని, కనీసం ఈ విషయంపై అడగడానికి వెళ్తే సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టనీయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్‌లోకి వెళ్లి హైకోర్టు తీర్పుపై అధికారులతో మాట్లాడే అవకాశం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.






